తెలంగాణ

telangana

ETV Bharat / state

అసలు ఆ 'నోట్లు' ఎక్కడివి? - REVANT

"ఓటుకు నోటు కేసులో పట్టుబడ్డ డబ్బులు ఎక్కడివి..? ఎవరిచ్చారు..? ఎవరి ఖాతా నుంచి తీశారు...? " ఇప్పుడు ఇవే ప్రశ్నలను రేవంత్​ రెడ్డికి ఈడీ సంధించింది.

ఈడీ ఎదుట రేవంత్​

By

Published : Feb 19, 2019, 4:59 PM IST

ఈడీ ఎదుట రేవంత్​
ఓటుకు నోటు కేసులో ఈడీ అ‌ధికారుల విచారణకు కాంగ్రెస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్​రెడ్డి హాజరయ్యారు. కేసుకు సంబంధించిన ప్రతాలను తన వెంట తీసుకొచ్చారు. కేసుకు సంబంధించి ఇప్పటికే వేం నరేందర్​ రెడ్డితో పాటు ఆయన కుమారులను ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు విచారించారు.

2015లో మొదలైన కథ

2015లో నామినేటేడ్​ ఎమ్మెల్సీ స్టీఫెన్​ సన్​కి రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్ పట్టుబడ్డారు. అసలు ఆ డబ్బు ఎవరిది... ఎలా వచ్చింది... అనే అంశాలపై ఈడీ ఆరా తీస్తోంది. విచారణలో రేవంత్​ చెప్పే సమాధానాలను బట్టి ఈ కేసులో మరో నిందితుడు ఉదయ సింహను అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి:పొలంలో ఫ్యాన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details