భారీగా నిధులు ఇవ్వండి - ఛైర్మన్ ఎన్.కె. సింగ్
తెలంగాణ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర అవసరాలు నివేదించేందుకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర సంక్షేమ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులను కమిటీకి సీఎం ప్రాధమికంగా వివరించనున్నారు. అనంతరం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నిధుల ఆవశ్యకత తెలియచేస్తారు.
భారీగా నిధులు ఇవ్వండి
3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సీఎస్ జోషి మిషన్ కాకతీయపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు సాధారణ చర్చ ఉంటుంది. సాగు, తాగు నీరు, స్థానిక సంస్థలు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు, హరితహారం తదితర అంశాల్లో సహకారం అందించాలని ప్రభుత్వం కోరనుంది.
అవసరాలు, ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని ఆర్థిక సంఘానికి అందించేందుకు సమగ్ర నివేదికను రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సిద్ధం చేశారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
Last Updated : Feb 19, 2019, 12:24 PM IST