తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏపీలో తప్పైన ఫిరాయింపులు ఇక్కడ ఒప్పెలా అవుతాయి' - విజయ శాంతి

ఏపీలో పార్టీ ఫిరాయింపులను విమర్శించిన వైకాపా అధ్యక్షుడు జగన్​ ఇక్కడ వాటిని ఎలా ప్రోత్సహిస్తున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్​ పర్సన్​ విజయ శాంతి విమర్శించారు. స్పీకర్​ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

విజయశాంతి

By

Published : Apr 27, 2019, 9:29 PM IST

ఏపీలో పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణలో తెరాస చేస్తోన్న ఫిరాయింపులు తప్పో...ఒప్పో సమాధానం చెప్పాలని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్‌ విజయశాంతి డిమాండ్‌ చేశారు. తెదేపా ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని గుర్తు చేశారు. ఏపీలో తప్పు అంటున్న వైకాపా అధ్యక్షుడు తెలంగాణలో వాటిని ప్రోత్సహిస్తున్నట్లేనా అని నిలదీశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి​ చట్టబద్ధంగా నడుచుకోవటం లేదని విమర్శించారు. అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్​పై ఉందని ఆమె తెలిపారు.

జగన్​ పార్టీ ఫిరాయింపులను ఇక్కడెలా ప్రోత్సహిస్తారు

ABOUT THE AUTHOR

...view details