నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. అయితే ఈసారి 11 రోజులు ఆలస్యంగా వచ్చాయని... జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని వివరించారు. ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల రుతుపవనాలు చురుగ్గా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులు వ్యవసాయపనులు మొదలు పెట్టవచ్చని సూచించారు.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... - నైరుతి రుతుపవనాలు
రైతులు, ప్రజలు ఆశగా ఎదురు చూస్తోన్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టత ఇచ్చింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అన్నదాతలు వ్యవసాయ పనులు మొదలుపెట్టాలని సూచించారు. నైరుతి ఆలస్యం వల్ల తెలంగాణలో 48 శాతం వర్షపాతం లోటుగా ఉందని అన్నారు.
నైరుతి పవనాలు