లాక్డౌన్తో పనులు లేక వీధినపడ్డ రోజువారి కూలీలకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆపన్నహస్తం అందిస్తున్నారు. పరిశ్రమలు మూత పడటంతో కార్మికులు.. పనులు లేక పిల్లా పాపలతో, ముల్లె మూట సర్దుకుని చెట్ల కిందో.. మెట్రో కిందకో చేరి దాతలు అందజేసే భోజనాలతో కాలం వెల్లదిస్తున్నారు. హైదరాబాద్లోని చిలకలగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఇలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిపై ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. ఈ వార్తను చూసిన ఎంపీ.. ఆయా ప్రాంతాల్లోని కూలీలకు భోజనం పంపిణీ చేసేందుకు అనుచరులను పంపించారు. ఆపత్కాలంలో పేదలను ఆదుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
పేదలకు అండగా నిలుస్తోన్న ఎంపీ రేవంత్ రెడ్డి - భోజన పంపిణీ
లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని పంపిణీ చేసి ఔదార్యాన్ని చాటుతున్నారు. సంక్షోభంలో సాటి వారికి సాయం చేస్తూ.. సామాజిక బాధ్యతగా ముందుకు సాగుతున్నారు.
mp revanth reddy
మానవాతవాదులంతా ముందుకొచ్చి.. కష్టకాలంలో నిరు పేదలకు అండగా ఉండాలని ఎంపీ కోరారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి:2డీజీ ఔషధం పంపిణీ ప్రారంభం కాలేదు.. మోసపోవద్దు: కేటీఆర్