తెలంగాణ

telangana

ETV Bharat / state

KODANDARAM: 'రూ.50కే పెట్రోల్​, డీజిల్​ ఇవ్వండి.. లేకుంటే దిగిపోండి'

ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి పేదల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు కేంద్ర, రాష్ట్రాల పన్నులే కారణమన్నారు. నాలుగేళ్లలో వారి పన్ను రాబడి 400 శాతం పెరిగిందని కోదండరాం తెలిపారు.

Kodandaram
Kodandaram

By

Published : Jul 29, 2021, 6:05 PM IST

50 రూపాయలకే పెట్రోల్​, డీజిల్​ ఇవ్వగలరని ఆ ధరకు ఇస్తే ఇవ్వండని.. లేకుంటే అధికారం నుంచి దిగిపోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదందరాం డిమాండ్ చేశారు. కానీ ప్రజలకు ఇంతటి అన్యాయం చేసే హక్కు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని లేదని విమర్శించారు. పెట్రోల్​, డీజిల్​, గ్యాస్​ ధరల పెరుగుదలకు నిరసనగా కోదండరాం సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సాయంత్రం.. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. కోదండరాం చేత దీక్షను విరమింపజేశారు. కేవలం నాలుగేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల ఆదాయం 400 శాతం పెరిగిందని తెలిపారు. దేశంలో గత మూడేళ్ల నుంచి ఆర్థికాభివృద్ధి మందగించిందని కోదండరాం అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్​తోనే బతుకు బండి నడుస్తోందని.. ధరలు పెరిగితే జీవితాలు అధ్వాన్నంగా మారుతున్నాయని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు.

KODANDARAM: 'రూ.50కే పెట్రోల్​, డిజిల్​ ఇవ్వండి.. లేకుంటే దిగిపోండి'

ధరల పెరుగుదలపై ఆగస్టు రెండో వారంలో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామని కోదండరాం వెల్లడించారు. రవాణా రంగంలోని బాధితులతోనూ సమావేశాలు జరుపుతామన్నారు. సత్యాగ్రహ దీక్ష అనంతరం కోదండరాం పార్టీ శ్రేణులతో కలిసి వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు.

'కేసీఆర్​ సీఎం అయ్యాక పెట్రోల్​ మీద పన్ను 30 నుంచి 35 శాతానికి పెంచారు. డీజిల్​పైన.. 22 నుంచి 27 శాతం పన్ను వేశారు. కేంద్రం సైతం ఇదే మాదిరిగా పన్నులు పెంచుకుంటూ పోయింది. ఇంత పెద్ద ఎత్తున పన్నుల సొమ్ము ఏం చేస్తారంటే.. కేసీఆర్​ కాంట్రాక్టులను పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం.. కార్పొరేట్లను పోషిస్తుంది.'

- కోదండరాం, తెజస అధ్యక్షుడు

ఇదీచూడండి:Etela: 'కేసీఆర్‌ చేసిన అవమానాలు భరించలేకే ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా చేశారు'

ABOUT THE AUTHOR

...view details