తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy on G-20 Summit 2023 : 'జూన్‌ 15 నుంచి వ్యవసాయానికి సంబంధించి కీలక సమావేశాలు' - ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో జీ 20 సమావేశాలు

G-20 Summit 2023 in India : హైదరాబాద్‌ వేదికగా జూన్‌ 15 నుంచి 17 వరకు వ్యవసాయానికి సంబంధించి కీలక సమావేశాలు జరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. జీ-20 మంత్రుల స్థాయి సాగు సమావేశాల్లో 29 దేశాలతో పాటు ప్రపంచ వ్యవసాయ పరిశోధన సంస్థల అధిపతులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ క్రమంలోనే కరోనా తర్వాత ఉత్పన్నమైన అనేక రకాల అంశాలపై విస్తృత చర్చలకు జీ-20 వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు.

Kishanreddy
Kishanreddy

By

Published : Jun 12, 2023, 3:47 PM IST

G-20 Summit in Hyderabad : జీ-20 దేశాల సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న దృష్ట్యా 46 రంగాలపై అద్భుతమైన చర్చలు జరుగుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జీ-20 దేశాల సమావేశాలకు మన దేశం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రారంభం నుంచి ఇప్పటి దాకా ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుందని తెలిపారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

Kishanreddy Comments on G-20 Summit 2023 : ఈ సందర్భంగా భారత్ సహా ప్రపంచ దేశాలు ఈ సమావేశాలను ఆసక్తిగా పరిశీస్తున్నాయని కిషన్‌రెడ్డి చెప్పారు. కరోనా తర్వాత ఉత్పన్నమైన అనేక రకాల అంశాలపై విస్తృత చర్చలకు జీ-20 వేదిక కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 46 రంగాలకు సంబంధించి 250కి పైగా సమావేశాలు భారత్‌లో సాగుతున్నాయని వివరించారు. ఇప్పటి వరకు 56 నగరాల్లో 140 సమావేశాలు ముగిశాయని తెలిపారు. ఈ నెల‌ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ వేదికగా వ్యవసాయ రంగంపై సమావేశాలు జరగనున్నాయని చెప్పారు. ఇది మంత్రుల సమావేశమని.. భారత్ సహా 29 దేశాల మంత్రులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. 9 అతిథి దేశాల మంత్రులూ పాల్గొంటారని స్పష్టం చేశారు.

'జీ-20 దేశాల సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న దృష్ట్యా 46 రంగాలపై అద్భుతమైన చర్చలు జరుతున్నాయి. మన దేశం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రారంభం నుంచి ఇప్పటి దాకా ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్ సహా ప్రపంచ దేశాలు ఈ సమావేశాలను ఆసక్తిగా పరిశీస్తున్నాయి. కరోనా తర్వాత ఉత్పన్నమైన అనేక రకాల అంశాలపై విస్తృత చర్చలకు జీ-20 వేదిక కావడం సంతోషంగా ఉంది. మొత్తం 46 రంగాలకు సంబంధించి 250కి పైగా సమావేశాలు భారత్‌లో సాగుతున్నాయి. ఇప్పటి వరకు 56 నగరాల్లో 140 సమావేశాలు ముగిశాయి. ఈ నెల‌ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ వేదికగా వ్యవసాయ రంగంపై సమావేశాలు జరగనున్నాయి. ఇది మంత్రుల సమావేశం. భారత్ సహా 29 దేశాల మంత్రులు, అధికారులు పాల్గొంటారు.' - కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తుది సమావేశాలకు ప్రధాని మోదీ..: ఈ క్రమంలోనే గోవా వేదికగా పర్యాటక, సాంస్కృతిక తుది సమావేశాలు జూన్ 19 నుంచి 4 రోజుల పాటు జరుగుతాయని కిషన్‌రెడ్డి ప్రకటించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అనంతరం.. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ప్రగతి మైదానంలో ప్రధాని మోదీ అధ్యక్షతన తుది సమావేశాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక సమావేశాల్లో 29 దేశాల అధినేతలు పాల్గొంటారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy on G-20 Summit 2023 : 'జూన్‌ 15 నుంచి వ్యవసాయానికి సంబంధించి కీలక సమావేశాలు'

ఇవీ చూడండి..

Kishan Reddy Special Interview : 'ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా భారత్‌'

ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details