తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు దిగిరాకుంటే.. ఐక్య పోరాటానికి సిద్ధం: ఉద్యోగుల సంఘం - తెలంగాణ ఉద్యోగుల సంఘం

ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలంటూ.. తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. సీఎం కేసీఆర్​ ఎన్నికల నెపంతో పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చారని సంఘం ప్రధాన కార్యదర్శి పురోషోత్తం విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికల తంతు ముగిసినందున తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని కోరారు.

TEU demandeds the govt should announce the PRC immediately
'ఉద్యోగులను తెరాస చిన్న చూపు చూస్తోంది'

By

Published : Dec 21, 2020, 4:30 PM IST

'ఎంప్లాయి ఫ్రెండ్లీ' ప్రభుత్వంగా చెప్పుకుంటున్న తెరాస.. ఉద్యోగులు, పెన్షనర్లను చిన్న చూపు చూస్తోందని తెలంగాణ ఉద్యోగుల సంఘం విమర్శించింది. ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలంటూ... డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు.

రెండున్నర ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న పీఆర్సీతో పాటు బకాయి ఉన్న రెండు డీఏ లను విడుదల చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ డిమాండ్ చేశారు. సంఘాల నాయకుల్లో కొంతమంది.. వారి స్వప్రయోజనాల కోసం ఉద్యోగుల జీవితాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వం ఎన్నికల నెపంతో పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని సంఘం ప్రధాన కార్యదర్శి పురోషోత్తం విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికల తంతు ముగిసినందున తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోని పక్షంలో.. ఉద్యోగులమంతా ఐక్య పోరాటానికి సిద్దమవుతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పీఆర్‌సీపై చర్చలకు సిద్ధమైన తెలంగాణ సర్కార్‌

ABOUT THE AUTHOR

...view details