TET Exam Telangana 2023 :తెలంగాణలోఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ శుక్రవారం రోజున జరగనుంది. రేపు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్.. మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ టూ నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 78 వేల 55 మంది అభ్యర్థుల కోసం 2 వేల 52 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ రాధారాణి తెలిపారు. పేపర్ వన్‌కు 2 లక్షల 69 వేల 557 మంది దరఖాస్తు చేయగా.. 1139 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. పేపర్ టూ 2 లక్షల 8 వేల 498 రాయనుండగా.. 913 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
TET Exam guidelines in Telugu :టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం గురువారం మధ్యాహ్నం, శుక్రవారం పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించినట్లు కన్వీనర్ తెలిపారు. సీసీ కెమెరాలు, ఫర్నీచర్, నిరంతర విద్యుత్ సరఫరా, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆర్టీసీ బస్సు సదుపాయం, బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను, ఆర్టీసీ, పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు.
TET Exam Tips Telugu :పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించబోమని టెట్ కన్వీనర్ రాధారాణి స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని చెప్పారు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలని సూచించారు. ఈనెల 27వ తేదీన టెట్ ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులంతా గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు.
Telangana Govt on Non-tax income : భారీ పన్నేతర ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ప్రణాళిక