తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2022, 6:25 PM IST

Updated : Mar 24, 2022, 8:27 PM IST

ETV Bharat / state

TET EXAM: టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆ రోజే పరీక్ష

TET EXAM
టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

18:23 March 24

TET EXAM: టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఆ రోజే పరీక్ష

TET EXAM: ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్‌ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. టెట్‌లో ఉత్తీర్ణులైన వారికే టీచర్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే.. జీవితకాలం వర్తిస్తుందని తెలిపింది.

జూన్‌ 12న టెట్:ఈ మేరకు జూన్‌ 12వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టెట్‌ నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో 2016 మే, 2017 జులైలో టెట్‌ పరీక్ష నిర్వహించారు. త్వరలో సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుండటంతో.. టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.

వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్: పూర్తిస్థాయి నోటిఫికేషన్ రేపటి నుంచి http://tstet.cgg.gov.inవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని కన్వీనర్, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులు టెట్ రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. బీఈడీ అభ్యర్థులు కూడా టెట్‌లో పేపర్ వన్ రాసి.. 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్‌జీటీ ఉద్యోగాలకు పోటీ పడవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెట్‌లో ఉత్తీర్ణతకు 150 మార్కులకు జనరల్ అభ్యర్థులకు 90.. బీసీలకు 75.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 60 మార్కులు సాధించాలని వెల్లడించారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో వెయిటేజ్ ఉంటుందని రాధారెడ్డి తెలిపారు.

టెట్‌లో మార్పులు : ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6-10 తరగతులు బోధించేందుకు మాత్రమే అర్హులు. అందుకు టెట్‌లో పేపర్‌-2 రాసేవారు. ఇక నుంచి వారు 1-5 తరగతులకు బోధించేందుకు ఎస్జీటీలుగా నియమితులు కావొచ్చు. అంటే వారు టెట్‌లో పేపర్‌-1 రాయవచ్చు. కాకపోతే ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలి. ఇప్పటివరకు పేపర్‌-1కు కేవలం డీఈడీ వారు మాత్రమే అర్హులు.

Lifetime Validity for Telangana TET : ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సిందే. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. ఈ క్రమంలో విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్‌ పాసైన వారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) మార్కులు వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. టెట్‌లో వచ్చిన మార్కులకు ఉపాధ్యాయ నియామకాల్లో భాగంగా నిర్వహించే పరీక్షలకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు.

ఇదీ చూడండి:

  • Telangana TET Exam 2022 : టెట్‌లో అర్హత సాధిస్తే జీవితకాల గుర్తింపు
Last Updated : Mar 24, 2022, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details