తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం (టెస్కో) కరోనా మహమ్మారి నేపథ్యంలో చేనేత మాస్కులను సిద్ధం చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రెండు లక్షల మాస్కులను జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా పంపిణీ చేయనుంది. వాటితో పాటు వినియోగదారులకు విక్రయించడం కోసం కూడా మరికొన్ని మాస్కులను సిద్ధం చేసింది. మూడు లక్షల మాస్కులను నాంపల్లిలోని టెస్కో షోరూంలో అమ్మకానికి ఉంచింది.
చేనేత మాస్కులు సిద్ధం చేసిన టెస్కో - తెలంగాణ రాష్ట్ర చేనేత పారిశ్రామిక సహకార సంఘం
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో టెస్కో చేనేత మాస్కులను సిద్దం చేసింది. రెండు లక్షల మాస్కులను జీహెచ్ఎంసీ ద్వారా ఉచితంగా పంపిణీ చేయనుండగా... మరో మూడు లక్షల మాస్కులను నాంపల్లిలోని టెస్కో షోరూంలో అమ్మకానికి ఉంచింది.
చేనేత మాస్కులు సిద్ధం చేసిన టెస్కో
చేనేత వస్త్రంతో తయారు చేసిన ఈ మాస్కులను ఉతికి తిరిగి వినియోగించుకోవచ్చు. త్వరలో రత్నదీప్ సూపర్ మార్కెట్లలో కూడా ఈ మాస్కులను అమ్మకానికి ఉంచుతారు. రెండు డిజైన్లలో 20, 40 రూపాయల ధరల్లో ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాస్కులను విక్రయిస్తారు. విక్రయ కేంద్రాన్ని చేనేత శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు.
ఇవీ చూడండి: తెలంగాణలో మరో 11మందికి కరోనా... 1001కి చేరిన కేసులు