అమెరికాలో నివాసముంటూ ఆల్‌ఖైదాకు ఆర్థికంగా సహాయం చేశాడనే అభియోగంపై ఐదేళ్లు జైలు శిక్షను అనుభవించిన జుబేర్ అహ్మద్ హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు. ప్రస్తుతం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్మత్ పేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.
27 ఏళ్లు జైలు శిక్ష..
హైదరాబాద్ టోలిచౌకి పారామౌంట్ కాలనీలో నివాసముంటూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జుబేర్ 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లాడు. అక్కడి పౌరురాలిని వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. 2016లో జుబేర్ సోదరుడు ఆసిఫ్ అహ్మద్ సలీం, సుల్తాన్ సలీం ఆల్‌ఖైదాకు చెందిన.. అల్-అవ్లాకి ఆర్థిక సహాయం చేశారని అమెరికా అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో అమెరికా విచారించి జుబేర్ అహ్మద్‌కు 5 ఏళ్లు, అతని సోదరుడు, మిగతా నేరస్థులకు దాదాపు 27 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇటీవల జుబేర్ శిక్షా కాలం పూర్తైన కారణంగా అమెరికా ప్రభుత్వం అతనిని విడుదల చేసింది.