థీమ్ రెస్టారెంట్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. టేస్టీ ఫుడ్, కాన్సెప్ట్ నచ్చితే తప్పక ఆదరణ లభిస్తుందని నిరూపిస్తున్నారు నగరవాసులు. ఫుడ్ అనేది సెంట్రల్ పాయింట్‌గా పెట్టుకుని.. దానికి ఆడ్ ఆన్‌గా లైవ్ మ్యూజిక్, స్టాండప్ కామెడీ, ఈవెంట్స్, హోమ్లీ ఎన్విరాన్మెంట్, చక్కని హాస్పిటాలిటీ కల్పించి కస్టమర్ల ఆదరణ చూరగొంటున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని టెర్రాసిన్ కెఫే ఇదే ఒరవడిలో వెళ్లినా.. వీగన్ ఫుడ్, స్లో ఫుడ్ క్వాలిటీస్‌తో మరింత ప్రత్యేకతను చాటుకుంటోంది.
భోజనం.. జీవనవిధానం
రాజస్థాన్‌కు చెందిన ధనేష్ ఆహార రంగంలో ఏదైనా వినూత్నంగా చేయాలనే అభిరుచితో ఇంజినీరింగ్ చేసి ఈ రంగంలోకి ప్రవేశించారు. భోజనం అనేది కడుపునింపుకునే అంశం నుంచి అదొక జీవనవిధానమని గుర్తించారు. అందుకే తన కెఫేకు వచ్చే వారికోసం వేడి వేడి ఆహారంతో పాటు ఇంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
ఆర్డర్ చేయగానే భోజనం రాదు
ఈ కెఫేలో ఆర్డర్ చేయగానే భోజనం మీ టేబుల్ వద్దకు రాదు. మీ ఆర్డర్ తీసుకున్న తర్వాత వంట చేయటం ప్రారంభిస్తారు. కూరకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కోయడం దగ్గర్నుంచి అప్పుడే ప్రారంభిస్తారు. అన్ని హోటళ్లలో లభించే రెగులర్ మెనూ ఇక్కడ దొరకదు. ఫుడ్ లో వెరైటీ, ప్రయోగాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్.
కాసేపు కబుర్లు