ఈ సారి పసుపు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రూ.7111 ధర పలకడం విశేషం. మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోళ్లు ప్రారంభమైన పది రోజులకే.. అధిక ధర రావడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సోమవారం నాడు ప్రారంభమైన ఆన్లైన్ మార్కెట్లో.. కాడిరకం రూ.7111, గోల రూ.6601, చూర రకం రూ. 4516 ధర పలికింది.
రికార్డు ధర పలికిన పసుపు.. రైతుల హర్షం - మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు అధిక ధర
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో పసుపు పంటకు రికార్డు ధర వచ్చింది. మహదేవ్ అనే రైతు పంటను... పుల్లూరి నవీన్ ట్రేడర్స్ రూ.7111కు క్వింటాల్ చొప్పున కొనుగోలు చేసింది.
ఆన్లైన్ మార్కెట్లో పసుపు రికార్డు ధర.. రైతుల హర్షం
ఇబ్రహీంపట్నం మండలం అమ్మకపేటకు చెందిన మహదేవ్ అనే రైతుకు చెందిన సుమారు 5 క్వింటాళ్ల పసుపును పుల్లూరి నవీన్ ట్రేడర్స్ ఆన్లైన్లో రూ. 7111కు కొనుగోలు చేసింది. మెట్పల్లి మార్కెట్ యార్డులో ఇప్పటి వరకు కాడి రకం 567, గోల 268, చుర రకం 55 క్వింటాళ్ల వరకు కొనుగోలు జరిగినట్టు మార్కెట్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ ఫథకాలు: నిరంజన్ రెడ్డి
Last Updated : Feb 8, 2021, 7:21 PM IST