తెరాస భాజపాకు అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ అని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. కేసీఆర్ గెలుస్తున్న ప్రతి గెలుపులో ఓటమి ఉందన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ గెలిచాననుకోవడం సరైంది కాదని చెప్పారు. ఒవైసీ భూతం పట్టినప్పుడల్లా కేసీఆర్ సెక్యులరిజం మాట్లాడుతున్నారని విమర్శించారు. రాంమాధవ్, తాను ఇక్కడి వారమే అయినా తమ లక్ష్యం తెలుగు రాష్ట్రాలపైన లేదన్నారు.
'తెరాస ఓ ప్రజా వ్యతిరేకమైన పార్టీ' - తెరాస భాజపాకు అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ
కర్ణాటక మాదిరిగా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో భాజపా విజయం సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెరాస భాజపాకు అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ అని పేర్కొన్నారు.
!['తెరాస ఓ ప్రజా వ్యతిరేకమైన పార్టీ' 'Terasa is against all forms of party'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5342581-605-5342581-1576072440342.jpg)
'తెరాస అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ'
మహిళల మీద నేరాలకు మద్యపానం కారణమనేది సరైంది కాదని అన్నారు. జాతీయ స్థాయిలో మద్యపానంపై ఎలాంటి విధానం తీసుకోలేదని వివరించారు. దక్షిణాదిలో కాంగ్రెస్ పతనమైందని తిరిగి పుంజుకునే పరిస్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు.
'తెరాస అన్ని విధాలుగా వ్యతిరేకమైన పార్టీ'
ఇదీ చూడండి : 'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'