తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకెళ్లాయి: మంత్రి మల్లారెడ్డి - తెరాస చేపట్టిన కార్యక్రమాలు.. ఇతరపార్టీ నాయకుల చేరికలు

రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులంతా తెరాసలో చేరుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఘట్​కేసర్ మండలంలోని పలువురు కాంగ్రెస్​ నాయకులకు గులాబీ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు.

తెరాస చేపట్టిన కార్యక్రమాలు.. ఇతరపార్టీ నాయకుల చేరికలు

By

Published : Sep 22, 2019, 3:11 PM IST

ఘట్​కేసర్ వెంకటాపురం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలు, నాయకులు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ రామారావుతో సహా ఇతర పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. గత ఐదేళ్లుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి వెళ్లాయని మంత్రి తెలిపారు.

సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు ప్రజల్లోకెళ్లాయి: మంత్రి మల్లారెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details