భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు నిరంతరాయంగా ద్రవరూప వైద్య ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. రాష్ట్రానికి పదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని రూర్కేలాలో 6 కంటయినర్ ట్యాంకర్లలో 118.93 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్‌ను నింపుకుని హైదరాబాద్‌కు బయలుదేరినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇవాళ రాత్రి ఏడు గంటలకు సనత్‌నగర్ కు చేరుకుంటుందని వెల్లడించింది.
నేడు చేరుకోనున్న పదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ - హైదరాబాద్ తాజా వార్తలు
రాష్ట్రానికి పదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ సనత్‌నగర్‌కు చేరుకోనుందని... రైల్వే శాఖ తెలిపింది. ఒడిశాలోని రూర్కేలాలో 6 కంటయినర్ ట్యాంకర్లలో 118.93 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్‌ను నింపుకుని రైలు బయలుదేరినట్లు పేర్కొంది.
రాష్ట్రానికి చేరుకోనున్న పదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
మరోపక్క రెండు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇవాళ ఏపీలోని గుంటూరు, కృష్ణపట్నంకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు నాల్గవ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి... ఐదో ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని రూల్కేలా నుంచి చేరుకున్నాయి. భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక గ్రీన్ కారిడార్లలో నడుపుతున్నందువన అవి గమ్య స్థానానికి తక్కువ సమయంలోనే చేరుకుంటున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'