రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2,530 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 30,500 మంది ఇన్విజిలేటర్లను నియమించగా.. 144మంది ఫ్లయింగ్ స్క్వాడ్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. 400 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు - tenth exams latest news
పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ దృష్ట్యా విద్యార్థులంతా మాస్కులతో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు
కరోనా వైరస్ దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు మాస్కులతో హాజరయ్యారు. దగ్గు, తుమ్ములు, జ్వరంతో బాధపడే వారికి ప్రత్యేక గది కేటాయించారు. అవిభక్త కవలలు వీణా-వాణి మధురానగర్‌లోని ప్రతిభ హైస్కూల్లో పరీక్షలు రాస్తున్నారు. వారికి అధికారులు అరగంట ఎక్కువ సమయం కేటాయించారు. ఇద్దరు 9వ తరగతి విద్యార్థుల సహకారంతో పరీక్షలు రాస్తున్నారు వీణా-వాణి.
Last Updated : Mar 19, 2020, 10:42 AM IST