పది రోజుల్లో పరీక్షలు మొదలవనుండగా పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్‌కు చెందిన కొమురయ్య వెంకటమ్మ దంపతులు కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఐఎస్ సదన్ డివిజన్ రాజరాజేశ్వరి నగర్లో కూలి పని చేసుకుంటున్నారు. వారి కుమార్తె ప్రజ్ఞ, కుమారుడు ఇద్దరూ స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు.
పది రోజుల్లో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థిని ఆత్మహత్య
పది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండగా ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని.. ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పది రోజుల్లో పదో తరగతి పరీక్షలు.. విద్యార్థిని ఆత్మహత్య4
ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రజ్ఞ తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బయటకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల సమాచారంతో సైదబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:పిడుగుపాటుకు యువకుడి మృతి
Last Updated : Mar 9, 2020, 7:41 AM IST