పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ తలపెట్టిన 'చలో రాజ్‌భవన్' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రాజ్‌భవన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ అందుబాటులో లేరని.. వినతిపత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపాలని పోలీసులు సూచించారు.
Revanth Arrest: 'చలో రాజ్‌భవన్'లో ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డి అరెస్ట్ - revanth reddy arrested
13:39 July 16
'చలో రాజ్‌భవన్'లో ఉద్రిక్తత.. రేవంత్‌రెడ్డి అరెస్ట్
అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్తామని చెప్పి అటువైపుగా కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. అప్రమత్తమైన పోలీసులు.. ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. తోపులాటలో పలువురు పోలీసులు కిందపడిపోయారు.
అనంతరం పెద్దఎత్తున నినాదాలు చేసుకొంటూ బారికేడ్లు తోసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలతో కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు నిలువరించేందుకు యత్నించారు. కార్యకర్తల భుజాలపైకి ఎక్కిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. అనంతరం కార్యకర్తల భుజాల నుంచే బారికేడ్లు దూకేశారు. అంతేవేగంగా అప్రమత్తమైన పోలీసులు.. రేవంత్‌ను అరెస్ట్ చేశారు.
అయితే రేవంత్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని.. కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకొనేందుకు యత్నించాయి. వారందరినీ పక్కకు నెట్టిన పోలీసులు.. పీసీసీ అధ్యక్షుడిని అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీచూడండి:Revanth Reddy: 'అబద్ధాలతో మభ్యపెట్టి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారు'