తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్తత.. ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్ - తెలంగాణ వార్తలు

tension-at-lbnagar-twin-reservoirs-opening-congress-mp-revanth-reddy-arrest
ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

By

Published : Jan 9, 2021, 12:13 PM IST

Updated : Jan 9, 2021, 2:59 PM IST

12:13 January 09

ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

ప్రారంభోత్సవంలో ఉద్రిక్తత... రేవంత్ రెడ్డి అరెస్ట్

హైదరాబాద్​ ఎల్బీనగర్‌ పరిధిలో జంట రిజర్వాయర్ల ప్రారంభోత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. ఎల్బీనగర్‌లో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాసవి నగర్‌లో రూ.9.42కోట్ల వ్యయంతో జలమండలి నిర్మించిన జంట రిజర్వాయర్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 12గంటలకు ప్రారంభోత్సవం చేయాల్సిన ఉండగా ముందుగా ఎలా చేస్తారని స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డిని ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

నిర్ణీత సమయం కంటే ముందే కార్యక్రమం నిర్వహించారని కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీలు, తెరాస జెండాలను కాంగ్రెస్ కార్యకర్తలు చింపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను నిలువరించారు. రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.  

ఇదీ చదవండి:అభివృద్ధి పనులకు కేటీఆర్‌ శ్రీకారం.. కార్యక్రమంలో ఉద్రిక్తత

Last Updated : Jan 9, 2021, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details