తెలంగాణ

telangana

ETV Bharat / state

పరువు హత్య: హేమంత్​ నివాసం వద్ద ఉద్రిక్తత - gatchibowli hemanth murder latest news

పరువు హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తూ హేమంత్​ బంధువులతో కలిసి.. అడ్వొకేట్​ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అవంతిక తండ్రి దొంతి లక్ష్మారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Tension at Hemant's residence in chanda nagar
పరువు హత్య: హేమంత్​ నివాసం వద్ద ఉద్రిక్తత

By

Published : Sep 28, 2020, 9:54 PM IST

హైదరాబాద్ నగర శివారు చందానగర్‌లోని హేమంత్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పరువు హత్యకు వ్యతిరేకంగా హేమంత్​ బంధువులు, మిత్రులతో కలిసి అడ్వొకేట్ జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించింది.

హేమంత్‌ ఇంటి నుంచి అవంతిక తండ్రి దొంతి లక్ష్మారెడ్డి నివాసం వరకు ర్యాలీగా బయలుదేరేందుకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫలితంగా రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

హేమంత్ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీచూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details