కరోనా ప్రభావంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యార్థులు అధిక సంఖ్యలో వెళ్తోన్న నేపథ్యంలో గుంటూరు జిల్లా పొందుగుల అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. విద్యార్థుల రాకను అడ్డుకున్న పోలీసుల వాహనాలపై యువకులు రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి.
రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి - గుంటూరులో రాళ్ల దాడి
ఆంధ్రా - తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గుంటూరు జిల్లా పొందుగుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ నుంచి భారీగా విద్యార్థులు వస్తుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కృష్ణా నది వంతెనపై ఇనుప కంచెలు వేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, యువకులు గాయపడ్డారు.
రాష్ట్ర సరిహద్దులో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి
వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌కు సిద్ధపడిన వారినే ఏపీలోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు అదనపు ఎస్పీ చక్రవర్తి సరిహద్దుల్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Last Updated : Mar 27, 2020, 10:04 AM IST