BJP Office Muttadi: తెరాస-భాజపా శ్రేణుల మధ్య వివాదాలు మరింత ముదురుతున్నాయి. భాజపా కార్యాలయం ముట్టడికి గిరిజన సంఘాలు యత్నించగా.. కమలం శ్రేణులు అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్‌ను 12శాతానికి పెంచాలన్న ప్రతిపాదన రాలేదని కేంద్రం ప్రకటించడాన్ని నిరసిస్తూ తెరాస నేత గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
గిరిజన సంఘాల నేతలను భాజపా యువ మోర్ఛా నేతలు అడ్డుకోగా.. పరస్పరం ఘర్షణ, తోపులాట జరిగింది. గిరిజన సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు. భాజపా కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఆ కార్యాలయం వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.