ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో చీరవల్లి వందల ఏళ్లనాటి ఈ గ్రామం.. రెండు మూడు నెలల్లో పూర్తిగా కనుమరుగు కానుంది. పోలవరం ముంపు గ్రామం కావడంతో ఇక్కడివారిని ప్రభుత్వం తరలించబోతోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామ ఓటర్లు చివరిసారిగా తమ ఓటుహక్కును ఇక్కడ వినియోగించుకోనున్నారు. పునరావాస ప్రక్రియలో భాగంగా కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 44 గ్రామాలు తరలింపునకు సిద్ధంగా ఉన్నాయి. జూన్ నెలాఖరుకు వీరిని పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. వారందరికీ ఈ పంచాయతీ ఎన్నికలే ఇక్కడ చివరివి కానున్నాయి.
పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉద్విగ్నభరిత వాతావరణం - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
ఈ ఊరిపేరు చీరవల్లి. వందల ఏళ్లనాటి ఈ గ్రామం.. రెండు మూడు నెలల్లో పూర్తిగా కనుమరుగు కానుంది. ఏపీలో పోలవరం ముంపు గ్రామం కావడంతో ఇక్కడివారిని ప్రభుత్వం తరలించబోతోంది.
చీరవల్లి
వారికి తొలి ఓటు:
కొన్ని గ్రామాల ప్రజలను ఇప్పటికే ఇతర ప్రాంతాలకు తరలించారు. పోలవరం మండలం పైడిపాకల, రామాయపేట పంచాయతీలు, సింగన్నపల్లి శివారు గ్రామాల ప్రజలను జంగారెడ్డిగూడెం, గోపాలపురం మండలాల్లోని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. దాదాపు 350 కుటుంబాలకు చెందిన వీరంతా ప్రస్తుతం కొత్త ప్రాంతంలో తొలిసారిగా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.