అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన డాక్టర్ రేఖా((Tennis player Rekha Boyalapalli))… కరోనా సోకిన వారికి ఆహారం అందిస్తున్నారు. కరోనాతోపాటు వివిధ కారణాలతో బాధపడుతూ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, సహాయకులకు నాణ్యమైన ఆహారాన్ని మూడు పూటలా అందిస్తున్నారు. ఉస్మానియా, నిలోఫర్, కింగ్ కోఠి హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఈ సేవలను కొనసాగిస్తున్నారు.
Food Distribution: టెన్నిస్ క్రీడాకారిణి చేయూత - Hyderabad latest news
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి, రేఖా ఛారిటబుల్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డాక్టర్ రేఖా(Tennis player Rekha Boyalapalli) కరోనా బాధితులకు సొంత నిధులతో ఆహారం తయారు చేసి అందిస్తున్నారు. ఉస్మానియా, నిలోఫర్, కింగ్ కోఠి ఆసుపత్రుల్లోని కరోనా బాధితులు, సహాయకులకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు.
Food Distribution: టెన్నిస్ క్రీడాకారిణి చేయూత
అనేక ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు, వారి సహాయకులకు కావలసిన… ఆహారం, చికెన్, కోడి గుడ్లు, చపాతీలను ఇంటి వద్దనే తయారు చేయించి అందిస్తున్నట్లు రేఖా ఛారిటబుల్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ రేఖా తెలిపారు. లాక్డౌన్(Lock down) పూర్తయ్యే వరకు ప్రతి రోజూ మూడు పూటలు 200 మందికి ఉచిత అల్పాహారంతోపాటు భోజనం పంపిణీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కరోనా విపత్తు వేళ ప్రజల వద్దకు వెళ్లి సాయం చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క