వైకాపా నేతలను కరోనా కలవర పెడుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సహా కొందరు ఎమ్మెల్యేలకు ఇప్పటికే వైరస్ సోకింది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
నాకు కరోనా వచ్చింది.. అధైర్యపడొద్దని ఎమ్మెల్యే వీడియో - తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వార్తలు
ఏపీ తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మరో వైకాపా నేతకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
నాకు కరోనా వచ్చింది.. మీరెవరూ అధైర్యపడొద్దంటూ ఆ ఎమ్మెల్యే వీడియో
శనివారం కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నియోజకవర్గ ప్రజలెవరూ అధైర్యపడొద్దు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నియోజకవర్గ ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యం వహించవద్దు. నేను ప్రజలకు ఫోన్లో అందుబాటులో ఉంటాను-అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే
ఇదీ చదవండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'