తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని.. కూతురి దీక్ష

ఉద్యోగం కోల్పోయిన ఓ తల్లి.. అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఆమె పనిచేసిన సూపర్ స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం బకాయిలు చెల్లించాలని.. డిమాండ్​ చేస్తూ ఆమె పదేళ్ల కుమార్తె సీఐటీయూ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెరలో చోటుచేసుకుంది.

child dharna for mother issues
child dharna for mother issues

By

Published : Jan 1, 2021, 10:54 PM IST

ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెర వద్ద ఉన్న సూపర్ స్పిన్నింగ్ మిల్లు​ నష్టాల బాట పట్టడంతో ఇటీవల అందులోని ఉద్యోగులను తొలగించారు. అయితే మిల్లులో పనిచేసే కార్మికులకు న్యాయబద్ధంగా లే ఆఫ్ ప్రకటించలేదని.. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు.

ఇదే సూపర్ స్పిన్నింగ్ మిల్లులో పని చేసిన శివమ్మ అనే కార్మికురాలు ఇటీవల కాలంలో అనారోగ్య కారణాలతో మృతి చెందింది. శివమ్మ భర్త ఏడాది క్రితం మృతిచెందడంతో వారి కుమార్తె నందిని ఒంటరి అయిపోయింది. సీఐటీయూ నాయకులు చిన్నారి నందిని దీక్షా శిబిరంలో కూర్చో బెట్టి తన తల్లికి రావాల్సిన న్యాయబద్ధమైన బకాయిలు మిల్లు యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులతో పాటు కార్మికులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:2020లో మద్యం అమ్మకాల ఆల్​టైమ్ రికార్డు

ABOUT THE AUTHOR

...view details