తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం.. తొలిరోజు 10 మంది వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్​ విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కొవిషీల్డ్ వాక్సిన్ మూడోదశ ట్రయల్స్ కోసం.. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి వివరాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 10 మంది వాలంటీర్లు కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం నమోదు చేసుకున్నారు.

కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం.. తొలిరోజు 10 మంది వాలంటీర్లు
కొవిషీల్డ్ వాక్సిన్ ట్రయల్స్ కోసం.. తొలిరోజు 10 మంది వాలంటీర్లు

By

Published : Oct 2, 2020, 10:55 PM IST

ఏపీ విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో కొవిషీల్డ్ వాక్సిన్ మూడోదశ ట్రయల్స్ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారి వివరాల నమోదు ప్రక్రియను ప్రారంభించారు. కొవిషీల్డ్ వాక్సిన్ కోసం కేజీహెచ్​లో 10 మంది వాలంటీర్లు ముందుకొచ్చారు. కనీసం మూడు వందల మంది వరకు నమోదుకు అవకాశం ఉంటుందని, ఇందులో 100 మందిని ఎంపిక చేసి వాక్సిన్ ఇస్తామని కేజీహెచ్ పర్యవేక్షకులు డాక్టర్ సుధాకర్ వెల్లడించారు. ఇప్పటికే వాక్సిన్ ట్రయల్స్​పై సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆసుపత్రి వైద్య బృందానికి అవగాహన కార్యక్రమాలను అన్​లైన్ ద్వారా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:ఆశాజనకంగా ఆస్ట్రాజెనెకా ఫలితాలు!

ABOUT THE AUTHOR

...view details