హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్ - కేటీఆర్ వార్తలు
![హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్ ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9057484-444-9057484-1601896794306.jpg)
15:58 October 05
హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కేటీఆర్
అత్యంత సురక్షిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ, పురపాలక శాఖల అధికారులతో హోం మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ సమావేశమయ్యారు.
సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు గుమికూడే ప్రతిచోట సీసీ కెమెరా ఏర్పాటు చేయాలన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి :కొవాగ్జిన్... బలమైన వ్యాధినిరోధక శక్తి