ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుమలలో పది అడుగుల కొండ చిలువను స్థానికులు గుర్తించారు. కల్యాణ వేదిక వద్ద రహదారికిపైకి వస్తున్న దాన్ని గుర్తించిన జనం... పాములు పట్టే వారికి సమాచారం అందించారు. పాములు పడ్డటంలో నేర్పరి అయిన బాబు.. చాకచక్యంగా దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. జన సంచారం తక్కువగా ఉండటం వల్ల తరచూ అటవీ జంతువులు, పాములు రహదారులపైకి వస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద కొండ చిలువ - tirumala latest news
ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుమలలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. కల్యాణ వేదిక వద్ద రహదారికిపైకి వచ్చిన కొండ చిలువను గుర్తించిన స్థానికులు.... పాములు పట్టే వారికి సమాచారం ఇచ్చారు.

తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద కొండ చిలువ