కరోనా తీవ్రత నేపథ్యంలో సచివాలయంలో ఆంక్షలు విధించారు. సాధారణ సందర్శకులకు సచివాలయంలోకి అనుమతి నిషేధించారు. సందర్శకులకు ఇచ్చే తాత్కాలిక పాసులనూ రద్దు చేశారు. అత్యవసరమైతే సంబంధిత అధికారి ముందస్తు అనుమతి ఉంటేనే సందర్శకులకు అనుమతి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం ప్రవేశం ఉంటుందని తెలిపారు.
సచివాలయంలో సందర్శకుల తాత్కాలిక పాసులు రద్దు! - తెలంగాణ వార్తలు
కొవిడ్ నేపథ్యంలో సచివాలయంలో పలు ఆంక్షలు విధించారు. సందర్శకులకు ఇచ్చే తాత్కాలిక పాసులను రద్దు చేశారు. సందర్శకుల అనుమతి నిషేధించారు. కరోనా నిబంధనలు విధిగా పాటించాలని సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయంలో తాత్కాలిక పాసులు రద్దు, హైదరాబాద్ సచివాలయం
సచివాలయ ప్రాంగణంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ శానిటైజేషన్ విధిగా చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారు : హైకోర్టు