ఏపీలోని.. తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో.. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
tirumala: తిరుమలలో ఆ మార్గం మూసివేత - AP News
ఏపీలోని.. తిరుమల - అలిపిరి నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. జూన్ 1 నుంచి జులై 31వ తేదీ వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. కాలినడకన వెళ్లాలనుకునే భక్తులు.. శ్రీవారి మెట్ల ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు.
![tirumala: తిరుమలలో ఆ మార్గం మూసివేత ttd](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11907932-1103-11907932-1622032545054.jpg)
తిరుమల - అలిపిరి
కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని తితిదే అధికారులు సూచించారు. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి:'ఆక్సిమీటర్' యాప్ వాడుతున్నారా? జర భద్రం!