రాహుగ్రస్త సూర్యగ్రహణం కారణంగా.... రాష్ట్రాంలోని అన్ని ఆలయాలు మూసివేశారు. భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈరోజు ఉదయం 10గంటల18 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 38 నిమిషాల వరకు..... సూర్యగ్రహణం ఏర్పడనుంది. అనంతరం ఆలయాలను సంప్రోక్షణ చేసి... పూజాకార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
గ్రహణంతో ఆలయాలు మూసివేత
సూర్య గ్రహణంతో రాష్ట్రంలోని ఆలయాలను మూసివేశారు. గ్రహణం అనంతరం గుళ్లను సంప్రోక్షణ చేసి పూజాకార్యక్రమాలు ప్రారంభిస్తారు.
గ్రహణంతో ఆలయాలు మూసివేత
ప్రముఖ పుణ్యక్షేత్రాలు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భద్రాద్రి రాములవారి సన్నిధి, వేములవాడ రాజన్న ఆలయం, కొండగట్టు అంజన్న గుడిలో.. మధ్యాహ్నం 3 గంటల అనంతరం శుద్ధి చేసి సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరుగంటల వరకు దర్శనాలకు అనుమతించనున్నారు. కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయంలో సాయంత్రం 6 గంటలకు మహా సంప్రోక్షణ, శుద్ధి చేసి ఆలయాన్ని తెరవనున్నారు.
ఇదీ చూడండి:ఇంటి పన్ను చెల్లించలేదని టీవీ ఎత్తుకెళ్లారు.