హైదరాబాద్ మధురానగర్‌లోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు శ్రీలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి సుప్రభాత సేవ, పంచహారతులు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వరంలో నిర్వహించారు.
బంగారు మైసమ్మ ఆలయంలో వేడుకలు... మంత్రి తలసానికి ఆహ్వానం - బంగారు మైసమ్మ నవరాత్రి వేడుకలకు తలసాని శ్రీనివాస్‌కు ఆహ్వానం
దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారు శ్రీలక్ష్మీ దేవీ అలంకారంలో దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ నిర్వహకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిశారు. ఈనెల 21న నిర్వహించే మూలా నక్షత్ర వేడుకలకు ఆయనని ఆహ్వానించారు.
![బంగారు మైసమ్మ ఆలయంలో వేడుకలు... మంత్రి తలసానికి ఆహ్వానం temple management invite talasani srinivas yadav for navaratri celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9234441-426-9234441-1603110977783.jpg)
శరన్నవరాత్రులలో భాగంగా ఈ నెల 21న మూలా నక్షత్రం పురస్కరించుకొని బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆరోజు సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని నిర్వహకులు తెలిపారు. చండీ హోమం, పుస్తక పూజ, విద్యార్ధులకు నోట్ పుస్తకాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహేష్, ప్రమోద్, కృష్ణారెడ్డి, మొద్దు శ్రీను, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల