సికింద్రాబాద్లోని మానస దేవి నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఆలయ ప్రాంగణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. నాగులపంచమి సందర్భంగా విద్యుత్ అలంకరణతో ప్రాంగణమంతా కళకళలాడిపోయింది. భక్తులు పాలతో నాగదేవతకు అభిషేకం చేశారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయ కమిటీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు - nagulapanchami
నాగుల పంచమి పురస్కరించుకొని నాగ దేవత దేవాలయాలు వైభవంగా ముస్తాబయ్యాయి. ప్రాంగణాలన్ని భక్తజనులతో కిటకిటలాడాయి.

భక్తులతో కళకళలాడిన ఆలయ ప్రాంగణాలు