రాష్ట్రంలో గత రెండు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
తెలంగాణలో మరో మూడురోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు - వాతావరణంలో మార్పులు తాజా వార్త
వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్రంలో గత రెండు రోజులగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమశాతం తగ్గడం వల్ల మరో మూడురోజులు ఇలా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
రాగల మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయన్న ఆయన గడిచిన రెండు రోజుల్లో నల్గొండ 35.5డిగ్రీలు, ఖమ్మం 33.8 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా