రాష్ట్రంలో రాగల నాలుగైదు రోజుల్లో చలి తీవ్రత కొంతమేరకు పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి అధికమవుతోందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్న నాగరత్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి..
Temperatures dropped: గజగజ వణుకుతున్న తెలంగాణ.. నాలుగైదు రోజుల్లో మరింతగా! - Telangana news
రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న చలితీవ్రత పెరుగుతోంది. ఉదయంతో పోలిస్తే రాత్రిళ్లు చలి తీవ్రత మరీ ఎక్కువవుతోంది. రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చలి తీవ్రతతో ప్రయాణికులు, ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Temperatures dropped