తెలంగాణ

telangana

ETV Bharat / state

పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈనెల 19 వరకూ చలి తప్పదు..! - telangana Temperature news

రాష్ట్రంలో తేమ శాతం పెరిగి చలి వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆగ్నేయ భారతం నుంచి తేమ గాలులు రావడం, ఉత్తర భారతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులే ఇందుకు కారణమని వివరించారు. ఈ నెల 19 వరకూ ఇలాగే వాతావరణంలో మార్పులుంటాయన్నారు.

Temperatures dropped in a single day in telangana
ఒక్కరోజులోనే పడిపోయిన ఉష్ణోగ్రతలు.. 19 వరకూ ఇలాగే..!

By

Published : Mar 14, 2021, 7:23 AM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా 4.5 డిగ్రీల వరకూ తగ్గడంతో చలి వాతావరణం ఏర్పడింది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుండగా.. శుక్రవారం 18 డిగ్రీలుంది. ఇది సాధారణం కన్నా 3.1 డిగ్రీలు తక్కువ. గత 10 రోజుల్లో ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో ఇంకా పలుచోట్ల 13 నుంచి 16 డిగ్రీలు నమోదైంది. కొల్లూరు(మహబూబ్‌నగర్‌)లో 13.2, వలిగొండ(యాదాద్రి జిల్లా)లో 13.6, చౌడాపేర్‌(వికారాబాద్‌)లో 14.6, నెల్లికుదురు(మహబూబ్‌నగర్‌)లో 15.8 డిగ్రీలుంది. ఆగ్నేయ భారతం నుంచి తేమ గాలులు రావడం, ఉత్తర భారతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపుల కారణంగా తెలంగాణలో తేమ శాతం పెరిగి చలి వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలుంటున్నందున పొడి వాతావరణం ఏర్పడింది. ఈ నెల 19 వరకూ ఇలాగే వాతావరణంలో మార్పులుంటాయన్నారు.

ఇదీ చూడండి: 'రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం'

ABOUT THE AUTHOR

...view details