తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి చలిగాలులే కారణం : రాజారావు - హైదరాబాద్ వాతావరణ సమాచారం

రాష్ట్రంలో ప్రజలకు రాత్రివేళల్లో చలి ప్రభావం వణుకు పుట్టిస్తోంది. సీజన్‌ ప్రారంభ నెలలోనే సాధారణం కన్నా తక్కువస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి ఆరు డీగ్రీలు తక్కువ నమోదవుతున్నట్లు వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు.

temperatures decresed in night times effect of north east
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గడానికి చలిగాలులే కారణం : రాజారావు

By

Published : Nov 11, 2020, 8:04 PM IST

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 5 నుంచి 6 డీగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు బేగంపేట విమానాశ్రయంలో 12.4 డీగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందన్నారు.

ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని తెలిపారు. వీటి వల్ల ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపవచ్చన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు నుంచి వచ్చే గాలులతో కొద్దిగా చలితీవ్రత తగ్గవచ్చని రాజారావు వెల్లడించారు.

ఇదీ చూడండి:వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం.. సామాన్యుడికి చుక్కలు

ABOUT THE AUTHOR

...view details