తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు.. మరింత పెరిగే అవకాశం

తెలంగాణవ్యాప్తంగా సూర్యుడు భగభగలతో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాలలో అత్యధికంగా 47 డిగ్రీలు నమోదయ్యాయి.

temperatures-are-likely-to-increase-in-telangana
రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు.. మరింత పెరిగే అవకాశం

By

Published : May 23, 2020, 5:22 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సూర్యుడి భగభగలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటం వల్ల జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మధ్యాహ్నం మూడు గంటల వరకు

జిల్లా మండలం ఉష్ణగ్రతలు( డిగ్రీలు)
జగిత్యాల జిల్లా ధర్మపురి 47
మంచిర్యాల జిల్లా జన్నారం 46.9
నల్గొండ జిల్లా హాలియా 46.8
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లుపల్లి 46.4
పెద్దపల్లి జిల్లా మంథని 46.2
మహబూబ్​నగర్​ జిల్లా బాలానగర్ 46.1
నిర్మల్​ జిల్లా ​ ఎల్లాపూర్ 45.9
ఆదిలాబాద్ 45.7
కరీంనగర్​ జిల్లా చిగురుమామిడిపల్లి 45.6
రాజన్న సిరిసిల్ల జిల్లా నామాపూర్​ 45.6

రాగల మూడు రోజుల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశముందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి :'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం

ABOUT THE AUTHOR

...view details