ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. తెరాస పాలనలో అప్పుల పాలయ్యిందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో తెదేపా ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగుల పీఆర్సీ... పే రివిజన్ కమిషన్లా కాకుండా పే రెడ్యుసింగ్ కమిషన్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అన్నారు.
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం: ఎల్.రమణ - kukatpally kphb colony
కేపీహెచ్బీ కాలనీలో తెలుగుదేశం ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎల్.రమణ, నందమూరి సుహాసినీ పాల్గొన్నారు.
అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం: ఎల్.రమణ
చంద్రబాబు 2020 విజన్ వల్లే నేడు హైదరాబాద్ నగరానికి ప్రపంచ పటంలో గుర్తింపు లభించిందని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం, అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలుగా రాంచందర్ రావు, నాగేశ్వర్లు గెలిచిన తరువాత తిరిగి ఓటర్లను కలిసింది లేదని విమర్శించారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలోకి 'బ్యాండ్ బాజా బరాత్' ముఠా.. పోలీసులు అలర్ట్