ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు మహాకుంభ సంప్రోక్షణపై ముగిసిన చర్చ హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని దివ్యసాకేతంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ముచ్చింతంల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి సీఎం కేసీఆర్.. సాయంత్రం వెళ్లారు.వారికే బూస్టర్ డోసు CM KCR Review on Covid: రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, సచివాలయ నిర్మాణ పనుల పురోగతి, సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. 'యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే' Bhatti Vikramarka: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌లో చేసిన నాటకం ఆయన పదవిని దిగదార్చే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్‌గా చూపెట్టి.. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ' ప్రధాని చెప్పిందదే' Bandi Sanjay Comments: హనుమకొండలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై భాజపా నిరసన సభ నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.ప్రధాని కీలక భేటీ Modi reviews Covid situation: ఒమిక్రాన్ సహా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుత పరిస్థితులపై.. ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రులు సహా ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారీగా పెరిగిన ధరలు సంక్రాంతి పర్వదినం సందర్బంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. ప్రయాణికులతో పాటు వాళ్ల బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరలను భారీగా పెంచిందిఈనెల 12 నుంచే.. NEET PG Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ జనవరి 12న ప్రారంభకానున్నట్లు కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవియా తెలిపారు.వారికి మాత్రమే వర్క్ ఫ్రం హోం! Pregnant women: గర్భిణీలు, దివ్యాంగులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.రమేశ్‌బాబుకు కన్నీటి వీడ్కోలు Ramesh babu died: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. కరోనా పరిస్థితుల కారణంగా అతికొద్ది మంది సమక్షంలో దహస సంస్కారాలు జరిపారు.ఐపీఎల్‌పై క్లారిటీ! IPL 2022: వచ్చే ఐపీఎల్ సీజన్ నిర్వహణ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి సన్నాహాలు చేస్తోంది. భారత్ వేదికగానే ఈ టోర్నీ నిర్వహించనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ కొవిడ్ వ్యాప్తి తీవ్రమైతే టోర్నీ నిర్వహణ కోసం ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని అన్నారు.