jee advanced results 2022:జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటి పది ర్యాంకుల్లో నలుగురు తెలుగు విద్యార్థులే ఉన్నారు. పీఎల్ సాయి లోహిత్ రెడ్డి 2వ ర్యాంకు, వంగపల్లి సాయి సిద్ధార్థ 4, పి.కార్తికేయ 6, ధీరజ్ 8 వర్యాంకు సాధించారు. జాతీయ స్థాయిలో 24వ ర్యాంకు సాధించిన పల్లి జలజాక్షి ఐఐటీ మద్రాస్ జోన్ అమ్మాయిల విభాగంలో టాపర్‌గా నిలిచారు. తొలి వంద ర్యాంకుల్లో సుమారు 20 మంది 500వ ర్యాంకుల్లో దాదాపు వంద మంది తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఉన్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు - iit concling 2022
jee advanced results 2022: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో మొదటి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. పీఎల్ సాయి లోహిత్ రెడ్డి 2వ ర్యాంక్, వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ , పి.కార్తికేయ 6వ, ధీరజ్ 8వ ర్యాంకు సాధించారు. వివిధ కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు అగ్రస్థానాల్లో నిలిచారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది.
jee advanced results
ఐఐటీల్లో ప్రవేశానికి ఆగస్టు 28న నిర్వహించిన పరీక్షా ఫలితాలను ఐఐటీ బాంబే ఈరోజు ఉదయం ప్రకటించింది. ఈ ఫలితాల్లో బాంబే జోన్కు చెందిన ఆర్కే శిశిర్ 360 మార్కులకు 314 మార్కులు సాధించి మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నాడు. దిల్లీ జోన్కు చెందిన తనిష్క కబ్రా 277 మార్కులతో బాలికల్లో టాపర్‌గా నిలిచింది. ఆమె ఆల్ ఇండియాలో 16వ ర్యాంక్ సాధించింది. ఆగస్టు 28న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.50 వేల మంది హాజరయ్యారు. వారిలో 40 వేల మంది అర్హత సాధించారు.
ఇవీ చదవండి: