తెలంగాణ

telangana

ETV Bharat / state

Ukraine Crisis: ఉక్రెయిన్​లో యుద్ధ పరిస్థితులపై తెలుగు విద్యార్థిని ఏమన్నారంటే?! - ఉక్రెయిన్​ తెలుగు విద్యార్థిని

Ukraine Crisis: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అక్కడి తెలుగు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ ఈటీవీ భారత్​కు అక్కడి పరిస్థితులను వివరించారు.

Ukraine Crisis
రాజధాని కీవ్‌ వైపు ప్రయాణాలు చేయొద్దన్నారు

By

Published : Feb 24, 2022, 2:22 PM IST

Telugu student on Ukraine Crisis: అత్యవసరం అయితే తప్ప తమను బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారని ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని లక్ష్మీ శ్రీలేఖ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ భారత్​’తో ఆమె మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలిపారు. తాము ఉన్న జబరేషియా ప్రాంతం ఈశాన్య ఉక్రెయిన్‌ కిందికి వస్తుందని.. అయితే ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులు ఆందోళన చెందేంత స్థాయిలో లేవని చెప్పారు. రాజధాని కీవ్‌ వైపు మాత్రం ప్రయాణాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని చెప్పారని ఆమె వివరించారు. 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను ఇంట్లో ఉంచుకోవాలని అధికారులు సూచించారన్నారు.

మా యూనివర్సిటీలో సుమారు 500 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఈనెల 25, 26 తేదీల్లో భారత్‌కు వచ్చే విమానాలు రద్దు అయ్యాయి. భారత రాయబార కార్యాలయ అధికారులు మాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విద్యార్థులందరినీ తరలిస్తామని చెప్పారు. బయటకు వెళ్లేటప్పుడు పాస్‌పోర్టు ఉంచుకోవాలని సూచించారు. తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వీడి రావాలని భారత ప్రభుత్వం చేసిన సూచన మేరకు చాలామంది స్వదేశానికి బయల్దేరుతున్నారు. మార్చి 10 వరకు ఉన్న టికెట్లన్నీ బుక్‌ అయిపోయాయి

- లక్ష్మీ శ్రీలేఖ, ఉక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థిని

ఉక్రెయిన్​లోని భారతీయులకు సూచనలు...

రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఆ దేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఉన్నాయని.. ఉక్రెయిన్​లో ప్రజలు తాము ఉన్న స్థలాల్లోనే ఉండాలని సూచించింది. ఇళ్లు, వసతిగృహాలు, శిబిరాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం సూచనలు చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వస్తున్న ప్రజలు వెనక్కి మళ్లాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

ఉక్రెయిన్​పై యుద్ధం ప్రకటించిన పుతిన్.. కీవ్​లో పేలుడు

ఉక్రెయిన్ గగనతలం మూసివేత.. ఎయిర్ఇండియా విమానం వెనక్కి

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. బెలారస్ నుంచి చొరబడ్డ రష్యా సైన్యం

ABOUT THE AUTHOR

...view details