తెలంగాణ

telangana

ETV Bharat / state

Liquor Sales In Telugu States: మునిగి తేలుతున్న మద్యం ప్రియులు.. ఖజానాకు కాసుల వర్షం - పది నెలల్లో మద్యం అమ్మకాలు

Liquor Sales In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. పది నెలల్లో దాదాపు 47వేల కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు మంచినీళ్లలా తాగేశారు. తెలంగాణలో 25వేల కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌లో 21 వేల కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా.. ప్రభుత్వ ఖజానాలకు భారీగా ఆదాయం సమకూరింది.

Liquor Sales
Liquor Sales

By

Published : Feb 14, 2022, 4:37 PM IST

Liquor Sales In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోను మద్యం క్రయవిక్రయాలు ప్రభుత్వాల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం జారీ చేసే లైసెన్స్​ల ద్వారా మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. ఏపీలో ప్రభుత్వమే ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తోంది. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోను వాణిజ్య పన్నుల రాబడుల తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే వనరు అబ్కారీ శాఖల నుంచే కావడంతో పాలనలో ఈ ఆదాయం కీలకమైంది.

పది నెలల్లో రూ.47వేల కోట్లు..

2021-22 ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో దాదాపు 47వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 25,238.29 కోట్లు సరుకు విక్రయించినట్టు వెల్లడించారు. 3.07 కోట్ల కేసుల లిక్కర్‌, 2.71 కోట్ల కేసుల బీరు అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. ఇందులో తయారీ, విక్రయదారులకు 35 నుంచి 38శాతం వాటా పోగా... మిగిలిన మెుత్తం వ్యాట్‌, ఎక్సైజ్‌ సుంకాలు, లైసెన్స్‌ ఫీజుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.

ఏపీలోనూ అదే జోరు..

ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. 21,169 కోట్ల విలువైన సరకు అమ్ముడైందని అధికారులు ప్రకటించారు. 2.13కోట్ల లిక్కర్‌, 62.90 లక్షల కేసుల బీరు విక్రయం జరిగిందన్నారు. ఇందులో సగటున 20శాతం అంతకంటే తక్కువ మద్యం తయారీదారుల వాటా పోగా.. మిగిలిన ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. ఏపీలో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా... ధరలు పెంచడంతో వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని ఆబ్కారీశాఖ అధికారులు వెల్లడించారు.

రెండో ఆదాయ వనరుగా..

ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 10 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు వాణిజ్య పన్నుల రాబడుల తరువాత ఆబ్కారీశాఖ ద్వారా ఎక్కువ ఆదాయం సమకూరింది.

ఇదీ చూడండి :ఆ రాష్ట్ర ఎన్నికల్లో రూ.404 కోట్ల విలువైన మద్యం స్వాధీనం!

ABOUT THE AUTHOR

...view details