విభజన సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలన్న ముఖ్యమంత్రుల నిర్ణయానికి అనుగుణంగా రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ బీఆర్కేభవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విభజన వ్యవహారాల కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
విభజనాంశాలు సహా అన్ని విషయాలపైనా...
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజనాంశాలు సహా అన్ని విషయాలపైనా భేటీలో చర్చించారు. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల వ్యవహారాలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, పౌరసరఫరాల సంస్థ సంబంధిత అంశాలు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. రెండు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను సమావేశంలో వినిపించారు.