తెలంగాణ

telangana

By

Published : Nov 18, 2020, 11:23 PM IST

ETV Bharat / state

విద్యుత్ ఉద్యోగుల విభజనపై విచారణ వాయిదా

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై రెండో రోజు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది... జస్టిస్ ధర్మాధికారి ముగింపు నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ స్థానికత గల ఎస్సీ, ఎస్టీలైన తమను తెలంగాణకు కేటాయించడాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు.

విద్యుత్ ఉద్యోగుల విభజనపై విచారణ వాయిదా
విద్యుత్ ఉద్యోగుల విభజనపై విచారణ వాయిదా

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో వరుసగా రెండో రోజు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ జెన్​కో, ట్రాన్స్​కో, డిస్కంలు సహా పలువురు ఏపీ ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం విచారించింది.

తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది... జస్టిస్ ధర్మాధికారి ముగింపు నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక సమతుల్యత అంశాలు లేకుండా ముగింపు నివేదికలో కేటాయింపులు జరిపారని కోర్టుకు విన్నవించారు. ఏపీ స్థానికత గల ఎస్సీ, ఎస్టీలైన తమను తెలంగాణకు కేటాయించడాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకించారు. ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయడం వల్ల జీతాలు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఉద్యోగుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ఈ దశలో కలగజేసుకున్న జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం... తొలుత జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదిక చట్టబద్ధతను నిర్ణయించిన తర్వాత ఏపీ రిలీవ్ చేసిన ఉద్యోగుల అంశాన్ని తేలుస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది.

ఇదీ చదవండి:'ప్రశాంతమైన హైదరాబాద్‌ కావాలా.. అల్లర్ల హైదరాబాద్‌ కావాలా..?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details