తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటీవీలో సీరియళ్ల సందడి ఇక మొదలు.! - etv serials latest news

కరోనా కారణంగా నిలిచిపోయిన తెలుగు సీరియల్స్‌ సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అభిషేకం, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ధారావాహికలతోపాటు రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే షోలు కూడా ఆరంభం కానున్నాయి. అలాగే జెమినీ టీవీలో కూడా సీరియళ్లు మొదలవనున్నట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది.

ఈటీవీలో సీరియళ్ల సందడి ఇక మొదలు.!
ఈటీవీలో సీరియళ్ల సందడి ఇక మొదలు.!

By

Published : Jun 22, 2020, 7:15 AM IST

Updated : Jun 22, 2020, 10:01 AM IST

తెలుగు లోగిళ్లలో మళ్లీ సీరియళ్ల సందడి ఆరంభం కానుంది. కరోనా నేపథ్యంలో కొంతకాలం నిలిచిపోయిన చిత్రీకరణలు మళ్లీ మొదలవడం వల్ల ఇంటింటా వినోదాన్ని పంచేందుకు ఈటీవీ అభిమాన తారాగణం విచ్చేస్తోంది. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, 2.30కు అత్తారింటికి దారేది, 3 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 3.30కు శ్రీమతి, రాత్రి 7గంటలకు అమ్మ, 7.30కు మనసు మమత, 8గంటలకు స్వాతి చినుకులు, 8.30కు నా పేరు మీనాక్షి సీరియళ్లు ప్రసారం కానున్నాయి. వీటితోపాటు రోజూ రాత్రి 9.30 గంటలకు ప్రసారమయ్యే షోలు కూడా వీక్షకులను అలరించనున్నాయి.

జెమినీలోనూ ఆరంభం

జెమినీ టీవీలో సోమవారం నుంచి సీరియళ్లు ప్రసారం కానున్నాయని సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. బంధం, బృందావనం, బంగారు కోడలు, చి.ల.సౌ. స్రవంతి, మట్టిగాజులు సీరియళ్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు ప్రసారం కానున్నాయని తెలిపింది. సాయంత్రం ప్రైమ్‌ టైం మెగా సీరియళ్లు ఈ నెల 29 నుంచి ప్రసారమవుతాయని పేర్కొంది.

ఇవీ చూడండి: మందు లేని మాయదారి రోగం కరోనా.. అంటూ పాటతో అవగాహన

Last Updated : Jun 22, 2020, 10:01 AM IST

ABOUT THE AUTHOR

...view details