తెలంగాణ

telangana

ETV Bharat / state

CJI: సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణమన్న తెలుగు కవులు - Rajbhavan news

రాజ్​భవన్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ ఎన్వీ రమణను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని కొనియాడారు.

Telugu poets
సీజేఐగా తెలుగు వ్యక్తి

By

Published : Jun 16, 2021, 6:31 PM IST

హైదరాబాద్‌లోని రాజ్​భవన్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Nv Ramana)ను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన జస్టిస్ ఎన్వీ రమణ(Nv Ramana)కు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు.... జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ సహా పలువురు రచయితలు, కవులు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. భూ మండలానికి న్యాయం అందించేందుకు సర్వోన్నత పీఠాన్ని జస్టిస్ రమణ అధిరోహించారంటూ.... జొన్నవిత్తుల తనదైన శైలిలో పద్యాన్ని వినిపించారు.

సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణమన్న తెలుగు కవులు

ఇదీ చదవండి:CJI JUSTICE NV RAMANA: సీజేఐతో ఎస్​ఈసీ.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఇష్టాగోష్ఠి.!

ABOUT THE AUTHOR

...view details